shabd-logo

తొలిప్రేమ

10 May 2023

4 Viewed 4
భారత్ సరిహద్దు లో శత్రు ముకలతో జరిగిన పోరాటం లో భారత ఆర్మీ కి చెందిన మేజర్ విక్రమ్ ,ఎంతో సాహసం తో శత్రు మూకలను ఎదిరించి తన సమూహ సభ్యులతో వారి ఆగడాలను తిప్పికొట్టి అందరిని మట్టికరిపించారు ,కానీ ఆ దాడి లో మేజర్ విక్రమ్ కి కూడా చాలా బలమైన గాయాలు కావడం  వల్ల అయిన వీర మరణం పొందారు,మేజర్ విక్రమ్ తన ధైర్య సాహసాలతో ఎన్నో సార్లు శత్రు సైన్యాన్ని దెబ్బకొట్టారు, ఎన్నో గాలెంటరీ అవార్డ్స్ మరియు శౌర్యచక్ర అశోక చక్ర  బిరుదులను కూడా తీసుకున్నారు ,అయన మన తెలుగు వాడు కావడం మన అందరికి ఎంతో గర్వ కారణం అంటూ వార్త సంచాలకులు చెప్తున్న వార్త వింటూ.,
"ఏమండీ"అంటూ లాలస ఒక్కసారిగా కుర్చీలో ఒరిగిపోయింది ,అప్పటికే ఆ వార్త వింటూ బయటకు వస్తున్న తన భర్త వికాస్ ఒక ఉదుటున లాలసను చేరి తనని తన బాహువులతో తీసుకున్నాడు,కంటి నుండి దూకడానికి సిద్ధం గా వున్న గంగ ను అదుపులో వుంచలేక,భర్త కౌగిలిలో ఒదిగిపోతూ,"విక్రమ్ విక్రమ్ చనిపోయారు వికాస్ "అంటూ ఏడుస్తూ వుంది.

వికాస్ ఆలోచనలు ఒక్కసారిగా గతం లోకి వెళ్లాయి.'వాళ్ళ వివాహం జరిగిన రోజు రాత్రి,తొలిరేయి సమయం లో.," లాలస,ఈరోజు నుండి మనం ఒక ఉన్నతమైన,అద్భుతమైన బంధం లో ఒకటి గా ఉండి మన జీవన పయనం మొదలుపెట్టబోతున్నాము మన మధ్య ఏ విధమైన దాపరికాలు అరమరికలు  వుండకూడదు అని నా ఉద్దేశ్యం,జీవితం లో నువ్వు నాకు కానీ నేను నీకు కానీ సమాధానం చెప్పుకునే రోజు రాకూడదు,అలా వుండాలి అంటే,మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఈ రోజు మాట్లాడుకుందాం ,ఇంకా ఈ రోజు మన తొలిరేయి అని  కంగారు పడకు మనకు మన జీవితం అంతా ముందే వుంది.
నా గురుంచి నీకు అంతా ముందే తెలుసు ఇంకా పొతే నా జీవితం లో వున్న ఒకే ఒక రహస్యం నేను ఎవ్వరికి చెప్పనిది ఏదైనా వుంది అంటే అది రేఖ."
వెంటనే తల ఎత్తి అనుమానం గా సందేహం గా చూస్తున్న లాలస ను చూస్తూ ,"అవును తనే మన పెళ్లి కి నా స్నేహితులతో వచ్చిన రేఖ తను నాకు ఒక మంచి స్నేహితురాలు చిన్నపటినుండి స్నేహితులం అయిన ఎంత సన్నిహితం గా వున్న స్నేహం అనే గీత ఎప్పుడు కూడా దాట లేదు ,కానీ తనకి ఎందుకు అనిపించిందో నేను తనని ప్రేమిస్తున్నాను అని అపోహ పడింది నన్ను ప్రేమించడం మొదలు పెట్టింది కానీ నాకు ఆ ఉద్దేశ్యం ఎంత మాత్రమూ లేదు తను నాకో మంచి స్నేహితురాలు మాత్రమే,మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం నువ్వు నాకు నచ్చడం జరిగిన తర్వాత తను నాకు తన విషయం చెప్పింది నేను ఎంత నచ్చచెప్పినా వినలేదు ఆత్మహత్య ప్రయత్నం చేసింది ,తనని కాపాడి ఎవరికీ తెలియకుండా వైద్యం చేయించాను కేవలం కొంతమంది దగ్గర మిత్రులకు మాత్రమే ఇది తెలుసు ఇప్పుడు ఇప్పుడే తను కోలు కుంటుంది నిజం కూడా త్వరగా తెలుసుకుంటుంది అన్న నమ్మకం కూడా నాకు వుంది,తన తొలి ప్రేమ కద కొంచెం కష్టమే కానీ మనమే తనకు సహాయం చేయాలి,ఈ విషయం నీకు వేరే ఎవరి ద్వారా అయిన తెలిసి నేను నీకు చెప్పలేదు అని ఎప్పటికి నన్ను తప్పు గా అనుకోకూడదు అనే చెప్తున్న" అంటూ లాలస వైపు చూస్తూ చెప్తున్న వికాస్ నీ చూసి ,లాలస హృదయం లో ఎదో తెలియని భాద మొదలు అయింది అది తన కళ్ళలో కనపడుతుంటే ఏమైంది లాలస అంటూ కంగారు గా అడుగుతున్న వికాస్ నీ చూస్తూ,
"మీ జీవితం లో రేఖ తన తొలిప్రేమ మీకు చెప్పింది మీరు మీ అభిప్రాయం కూడా చెప్పేసారు ,తనకు ఒక మిత్రుడి లా ఎప్పుడు తోడు వుంటా అని మాట కూడా ఇచ్చారు ,కానీ నా జీవితం లో జరిగింది చెప్తాను,అది విని  ఏంటో మీరే చెప్పండి."
          విక్రమ్,నాకు వున్న స్నేహితులలో మంచి మిత్రుడు చిన్నప్పటినుండి కలిసే చదువుకున్నాం ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఎంతో హాయిగా ఉండేవాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు,ఎప్పుడు నాతో సరదాగా మాట్లాడుతూ వుండే విక్రమ్ పదవ వ తరగతి వచ్చే సరికి నాతో మాట్లాడం తగ్గించాడు అవసరం ఐతేనే మాట్లాడే వాడు కానీ తన కళ్ల లో ఎదో కొత్త చెప్పలేని కొత్త కొత్త భావాలు కనపడేవి అవి ఏంటో అర్ధం అయేవి కావు  కానీ తన మీద అభిమానం మాత్రం పెరుగుతూనే ఉండేది.తర్వాత ఇంటర్ చదవడానికి తను వేరే ఊరు వెళ్ళాడు కానీ అప్పుడప్పుడు ఊరు వచ్చే వాడు తన కళ్ల లో నా పై ప్రేమ కనపడేది,నేను కూడా తనని ఇష్ట పడటం మొదలు పెట్టను అది ఎప్పుడు ఏలా జరిగిందో కూడా గుర్తు లేదు అది ప్రేమో,అభిమానమో ,స్నేహమో కూడా తెలియదు అప్పుడు.ఇంత లో తన తల్లిదండ్రులు ఒక ప్రమాదం లో చనిపోయారు,తను ఒంటరి వాడు అయ్యాడు తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది ఎమయ్యాడు అని తెలియదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలిసిన తర్వాత అస్సలు ఏ విషయాలు తెలియలేదు.
రేఖ విషయం లో మీకు తెలిసింది తను మిమ్మల్ని  ప్రేమిస్తున్నట్లు,అలాగే మీరు ప్రేమిచటం లేదు అని కూడా  రేఖ కు తెలిసింది,కానీ నా విషయం లో మాత్రం ఇది జరగలేదు,విక్రమ్ నన్ను ప్రేమించారా లేదా కేవలం స్నేహితురాలు గానే చూసాడా తెలియదు కానీ తన కళ్ల లో ప్రేమ చూశా నేను,ఒకవేళ తను ప్రేమించక పొతే ఒక మంచి స్నేహితుడిని అపార్ధం చేసుకున్న ఏమో అని అపరాధ భావం.ఎప్పటికి అయిన సమాధానం దొరుకుతుంది ఏమో అని చిన్న ఆశ,నేను మిమ్మల్ని మనసు పూర్తి గా వివాహం చేసుకున్నాను,నా హృదయం లో మీరు మాత్రమే వుంటారు,కానీ ఒక స్నేహితుడిగా విక్రమ్ ఎప్పుడు గుర్తు ఉంటాడు నాకు నిజం తెలుసుకునే అవకాశం వస్తే మీరు నా వెన్నంటి ఉండి సహాయం చేస్తారు కద" అంటూ అడుగుతున్న లాలస ను తన కౌగిలిలో తీసుకొని ఓదార్చిన ఆ రోజు తర్వాత తమ జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది విక్రమ్ గురించి తెలుసుకోవాలి అని చేసే ప్రయత్నం మాత్రం సఫలం కాలేదు' ,ఇంకా ఇప్పుడు విక్రమ్ చనిపోయాడు అని తెలిసి తన ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోతుంది,ఈ అపరాధ భావం  ఎప్పటికి పోదు అన్న భాద లో ఏడుస్తూనే తన భర్త కౌగిలిలో కొంత ఉపశమనం పొందుతూ వుంది.

ఒక వ్యక్తి తొలి ప్రేమ విఫలం అయిన స్నేహం కొనసాగుతుంది(రేఖ),ఇంకో వ్యక్తి స్నేహం,ప్రేమ మధ్య ఏది పొంది ఉంటుందో,ఎలా తెలుస్తుందో, అస్సలు తెలుస్తుందో  లేదో.

కశ్మిర్ ఆర్మీ ముఖ్య భవన సముదాయం లో,సమాచార విభాగం లో,ఆర్మీ ముఖ్య అధికారి తన సైనికులతో,
మిత్రులారా ! మీ అందరికి తెలుసు మన మేజర్ విక్రమ్ వీర మరణం పొందారు తనకు ఎవరు లేని విషయం కూడా మీకు తెలుసు కానీ తన భౌతిక కాయాన్ని తమ రాష్ట్ర నికి ఇవ్వమని కోరారు కానీ మేజర్ ఆఖరి కోరిక తన శరీరం ఈ సరిహద్దు లోనే వుండాలి అని తన ఆత్మ ఎప్పుడు కూడా దేశానికి పహారా కాస్తూనే ఉంటుంది అని,అందువల్ల తన శరీరానికి అంతిమ సంస్కారం ఇక్కడే జరుగుతుంది,అందరూ సైనికుల వలె తన ఉత్తరాలను కూడా తన హితులకు చేరవేసి మన స్నేహ ధర్మం నిర్వహిద్దాం .

అలా తన ఆఖరి ఉత్తరాల పయనం మొదలు అయింది.

తలుపు గంట మ్రోగటం తో తలుపు తీసిన లాలస ఎదురుగ వున్న ఆర్మీ అధికారులను ఆశ్చర్యం గా చూస్తూ ఉంటే,వచ్చిన వాళ్ళు" అమ్మ లాలస అంటే మీరేనా" అంటే ఆ ఆశ్చర్యం లోని "తల పైకి క్రిందకి ఊపుతుంది","మేజర్ విక్రమ్ ఉత్తరాలను తన స్నేహితులకు అందిస్తూ వస్తున్నాము ఇంకా ఈ చివరి ఉత్తరము మీకు చేరిస్తే మా పని పూర్తి అవుతుంది" అంటూ లేఖ లాలస కు  అందించి వారు వెళ్ళిపోతారు,అంత సమయం మొత్తం లాలస నిశ్శబ్దం గానే వుంది  తన హృదయం లో ఎంతో అలజడి ఎన్నో ప్రశ్నలు,వికాస్ వచ్చే వరకు లాలస ఆ లేఖ అలా పట్టుకొని కూర్చొనే వుంది దానిని చదవాలి అంటే తనకు భయం వేస్తుంది,ఆలా ఆ ఆలోచనలో వున్నప్పుడే మళ్ళీ తలుపు గంట మ్రోగింది ఈసారి వచ్చింది వికాస్ అప్పటిదాకా ఏమి మాట్లాడని లాలస ఆ లేఖ వికాస్ కి ఇచ్చి తన వైపు చూస్తూ ఉంటుంది,ఒకసారి ఆ లేఖని చూసి,లాలస పరిస్థితి అర్ధం అయిన వికాస్ తనని దగ్గరికి తీసుకొని తన పక్కన కూర్చొని లేఖని తెరచి చదవమని లాలస కి ఇచ్చి తన పక్కనే తనని పట్టుకొని కూర్చుంట్టాడు.

చిన్ననాటి నేస్తం లాలస,
                                  వికాస్ గారు పిల్లలు మరియు నువ్వు అందరు బావున్నారు కదూ,
మీ గురించి ఎలా తెలుసు అని ఆశ్చర్య పోవద్దు ఎప్పుడు మీ గురించి మన స్నేహితులు చెప్తూనే వుంటారు నా గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా నాకు తెలుసు,తెలిసి కూడా ఎందుకు కలవలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు.
ఈ లేఖ నిన్ను చేరింది అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్లి వుంటాను కాబ్బట్టి నా మనసు లోని మాటలు ఇప్పుడైనా నిన్ను చేరాలి అని రాసిన నా చివరి మాటలు ఇవి,నీలో వుండే ఎన్నో ప్రశ్నలకు సమాధానం. ఒక పెళ్లి అయిన అమ్మాయి కి రాయకుడని తొలి మరియు చివరి ప్రేమ లేఖ ఇది,వికాస్ గారు మన్నిస్తారు కదూ,
        మన పాఠశాల లో తొమ్మిదవ తరగతి లో వున్న మనం పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వీడ్కోలు సభ లో మొదలు అయింది నా మనసు లో ని పై ప్రేమ ఆ రోజు మొదటిసారి నిన్ను చీర లో చుసిన నాకు మనసు లో ఏవో ఏవో కొత్త కొత్త భావాలు,అప్పుడే అప్పుడే చూస్తున్న సినిమాల ప్రభావం కావొచ్చు శరీరం లో జరిగే జీవక్రియల మార్పులు కావొచ్చు నువ్వు చాలా కొత్త గా కనిపించావు అల్లరి అల్లరి గా హాయిగా సాగుతున్న మన జీవితాలలో అనుకోని మార్పులు అవి,నీతో మాట్లాడాలి అన్న ఎదో బెరుకు నన్ను ఆపేసేది,ఆ వయసు లో ప్రేమ ఏంటి అని నీకు అనిపించొచ్చు కానీ ఆలా జరిగిపోయింది నా తొలిప్రేమ.ఎప్పుడు నిన్ను చూడాలి అని ఉండేది కానీ నీతో మాట్లాడాలి ని దగ్గరికి రావాలి అంటే ఎదో తెలియని భయం పిరికితనం నన్ను ఆపేసివి నీకు ప్రత్యేకంగా కనపడాలి అనే తాపత్రయం నీతో మాట్లాడాలి అంటే కూడా నా కాళ్ళు వణికేవి,ఇలా ఉంటే కష్టం అని ఇంటర్ మన ఊరికి దూరం గా చేరి పోయాను అక్కడ కూడా ని ఆలోచనలే వాటిని కొంచెం అయిన అదుపులో వుంచుకోవడానికి ఎన్ సి సి లో చేరాను అప్పుడే మెల్ల మెల్ల గా సైన్యం లో చేరాలి అనే ఆశ కలిగేది,సెలవులు వచ్చినప్పుడు ఊరికి వస్తే నా కళ్ళు నిన్ను వెతికేవి అప్పుడే నాకు ని కళ్ళలో నా పై ప్రేమ కనపడింది,నేను చెప్పకపోయినా నా ప్రేమ నీకు తెలిసినందుకు సంతోషం గా ఉండేది,ఆలా ఆలోచనలు ఊహల మధ్య బ్రతుకుతున్న నా జీవితం లో కోలుకోలేని దెబ్బ నా తలిదండ్రులా  మరణం,ప్రపంచం లో ఒక్కసారి గా నన్ను అనాధ ని చేసింది,అప్పుడు నాకు అస్సలు ఏమి కనిపించలేదు అంతా శూన్యం ఎవరికీ చెప్పకుండా ఎవరితో కలవకుండా దూరం గా ఉండి పోయాను అప్పుడే నా చీకటి లో చుక్కాని ల మా 
ఎన్ సి సి  మాస్టారు నన్ను ఆర్మీ వైపు వెళ్ళమన్నాడు ఆ సమయం లో  నాకు అదే మంచిది అనిపించింది.అస్సలు ఏది గుర్తు కూడా రాలేదు,ఆలా ఆర్మీ లో ఒక సంవత్సరం గడిచింది,మర్చిపోవాలి అనుకున్న మనసు ని విడిపోనిది తొలిప్రేమ అలానే నువ్వు ఎప్పుడు గుర్తు వచ్చే దానివి అస్సలు ఎవరికీ ఏమి చెప్పకుండా వచ్చిన నేనే మన ఊరికి వచ్చి నాకు ని ప్రేమ ని తెలిపి నీ తల్లీదండ్రుల అనుమతి తో నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను,కానీ అన్ని మనం అనుకున్నట్టు జరగవు కద అలానే ఒక ముష్కర మూక తో పోరాటం లో నా సహచర సైనికుడు వీర మరణం పొందాడు నాకు కూడా  గాయం అయిన ప్రాణాపాయం ఐతే కలుగలేదు కానీ ఆ సైనికునికి వివాహం జరిగి అప్పటికి ఒక సంవత్సరం కూడా కాలేదు భార్య గర్భవతి,నాకు ఎందుకో ఆ పరిస్థితి లో నువ్వు గుర్తు వచ్చావు ఒకవేళ నిన్ను నేను పెళ్లి చేసుకుంటే జరగరానిది జరిగితే తర్వాత పరిస్థితి ఏంటి నాకు అంటూ ఎవరు లేరు నువ్వు కూడా ఒకే సంతానం మీ వాళ్ళకి అప్పుడు వాళ్ళ గుండె ఆగిపోతుంది కూతురి పరిస్థితి కి. పెళ్లి చేసుకున్న ప్రతి సైనికుడి భార్య తల్లిదండ్రులు ఎంతో గర్వం తో వుంటారు చెప్పుకుంటారు కానీ ఒకవేళ ఏదైనా జరిగితే జీవితం మొత్తం పోరాటం చేస్తూనే వుండాలి,నీ మీద ప్రేమ తో నా మీద అభిమానం తో అప్పటికి ఒప్పుకున్న నీ భవిష్యత్తు మీద బెంగ తోనే వుంటారు వాళ్ళు ఎప్పటికి. ప్రేమించడం అంటే ప్రేమ ఇవ్వడమే కానీ మరొకరి లైఫ్ తీసుకోవడం కాదు కద, కాసేపు నీ తండ్రి స్థానం లో ఉండి ఆలోచిస్తే రెండు మార్గాలు నాకు తోచాయి ఒకటి ఆర్మీ వదలడం రెండు నిన్ను వదలడం,ఆర్మీ నీ వదలలేను అప్పటికి అది నా జీవితం లో విడదీయలేని భాగం అయింది,దేశ రక్షణ భాద్యత గా ఆలోచించే ఒక సైనికుడిగా నీ క్షేమం తలచి నిన్ను వదులుకావడానికి సిద్ధం అయ్యాను,నీకు నా ప్రేమ చెప్పలేదు కాబ్బట్టి కొన్ని రోజులకు నువ్వు నేను రాలేదు అని నాది స్నేహం మాత్రమే అని ఒప్పుకుంటావ్ నీ జీవితం లో ఒక మంచి తోడు దొరుకుతుంది అన్న తలంపు తో ఇలా చేశాను.నేను అనుకున్న విధంగా నీ జీవితంలో వికాస్ వచ్చారు,వికాస్ చాలా మంచివాడు ఉన్నత వ్యక్తిత్వం కలవాడు నిన్ను చాలా చాలా బాగా చూసుకుంటాడు అని తెలిసి చాలా సంతోషం వేసేది ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని,ఇప్పుడు మొత్తం నీకు చెప్పేసాను మనసు ప్రశాంతంగా వుంది,ఎప్పుడైనా నేను గుర్తు వస్తే నీ పెదాల పై ఒక చిన్న చిరునవ్వు ల గుర్తు వుండాలి అన్నికోరుకుంటూ,వికాస్ జాగ్రత్త గా చూసుకో.,
                                              నీ చిన్ననాటి నేస్తం.

లేఖ చదువుతూ వున్న లాలస కంటి నుండి కన్నీరు వస్తూనే వుంది,కానీ అది భాద తో కూడిన ఆనందం తో తన లో ఇప్పుడు  ఎలాంటి అపరాధ భావం లేదు కేవలం తొలిప్రేమ లోని జ్ఞాపకాలు తప్ప ,అప్పటిదాకా ఏమి మాట్లాడని లాలస,వికాస్ నీ హత్తుకొని,
నా తొలిప్రేమ,దేశం మీద ప్రేమ తో నన్ను మర్చిపోతే,మీ ప్రేమ నన్ను నేనే మర్చిపోయేలా చేసింది.
ఐ లవ్ యు సో మచ్ వికాస్ ....  .

తొలిప్రేమ అందరికి తీపి జ్ఞాపకం కావాలి అని కోరుకుంటూ ....
*********************************************
దేశం కోసం సైనికులు ప్రాణాలు ఇస్తే వారి కుటుంబం మొత్తం కూడా వారి జీవితాన్ని ఇచ్చినట్టే,గవర్నమెంట్ పెన్షన్ ఇంటిస్థలం,డబ్బులు ఇవేవి వారి ఒంటరితనం నీ దూరం చేయవు జీవితం మొత్తం పోరాటం చేస్తూనే వుండాలి,అంటువంటి వీరమాతలు,వీరపత్నులు అందరికి శిరసు వచ్చి నమస్కరిస్తూ ..

                 సమాప్తం.