shabd-logo
Shabd Book - Shabd.in

విరాట పర్వం

Satish

0 Part
0 Person has added to Library
0 Readers
Free

విరాట పర్వం THE SIGN OF Persistence "విరాట పర్వం" మనం ఈ పదం ఇంతకు ముందే మనం మన మహాభారతంలో విన్నాం. అక్కడ వారు వనవాసం లో భాగం గా విరాటరాజు రాజ్యంలో కొలువు ఉంటారు. అక్కడ జరిగింది మనకు ఒక పర్వం గా చుయించారు.కానీ మన విరాట పర్వం ఒక వ్యక్తి గురించి ఈ కథ ఎలా ఉంటాడో నేను చెప్పను మీరే చదివి తెలుసుకోండి. అది 2014 జూన్ 14,, జోరుగా వర్షం గురుస్తున్నా సమయం లో కర్నూల్ M.L.A ప్రాణభయంతో పరిగెత్తుతూ వస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే వెనుక దాసు కత్తి పట్టుకొని జీపులో వస్తున్నాడు. { ఈ దాసు ఎవరంటే భయనికే భయం పుట్టించే, మనిషి రూపం లో వున్న ఒక మృగం. ఈ దాసు గంగూలీ భాయ్ అనే ఒక మాఫియా కింగ్ యొక్క చెంచా. ఈ గంగూలీ భాయ్ కి ఒక కల ఉంది అదేంటంటే… ఎలాగైనా మన ఈ భారత దేశాన్ని అంతం చెయ్యాలని…. ఎందుకంటే మన దేశ సైనికులు వల్ల నాన్నని చంపేశారు} ఇక కథలోకి వేస్తే దాసు M.L.A తల నారికివేసి కర్నూల్ కొండారెడ్డి బురుజుకాడ వెలడతిశాడు. ఆ తలను చూసి కర్నూల్ ప్రజలు అంత భయబ్రాంతులకు అయ్యారు.. వారిలో దాసుపై వున్న భయం ఇంకా పెరిగి పోయింది.. ఆ ఎమ్మెల్యే కట్టించిన గవర్నమెంట్ పాఠశాలను కల్చివేసాడు. ఆ పాఠశాలలో వున్న చాలా మంది అక్కడే కాలిపోయారు, కొంత మంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ దాసు అక్రమాలు ఎలాగైనా ఆపాలని పోలీస్ చీఫ్ హేడ్ MAJOR KARTHIK నీ అప్పాయింట్ చేశారు. కర్నూల్ నుంచి కాస్త దూరం లో ఉన్న పులివెందుల అనే ఊరిలో ఒక పాత గొడౌన్ని చూసి దానిలో ఒక సీక్రెట్ బేస్ నీ ready చేసుకొని తన టీమ్ తో ఒక undercover operation స్టార్ట్ చేసాడు. ఇంతలో ఇంకొక దుర్మార్గం మొదలుపెట్టారు దాసు మనుషులు. ఆ రోజు వాళ్ళు భారత్ బంద్ అనే పేరు తో కర్నూల్ లో అల్లర్లు చేస్తున్నారు. ఆ బంద్ లో ఒక స్కూల్ బస్ తగల పెట్టేశారు.ఇదంతా మేజర్ కార్తిక్ ముందే జరుగుతున్నా ఆపలేని పరిస్థితి.కానీ దీన్ని ఒక జర్నిలిస్ట్ ప్రూఫ్స్ తో సహా కోర్టులో చుయించి, దాసు పై శిక్ష వేయించాడు. కోర్టు proofs నీ పరిశీలించి దాసుకి 2ఏళ్ళ జైలు శిక్ష వేసింది. దానితో పాటు 2కోట్ల ఫైన్ వేశారు. ఆ 2 కోట్లు బడించబడిన కుటుంబాలకు ఇచ్చింది. సరిగ్గా వారం కూడా గడవకముందే దాసునీ తప్పించి ఇంటికి తీసుకెళ్లారు.దాసు వచ్చిన కొన్ని రోజులకు ఆ రిపోర్టర్ మయం అయ్యాడు… కానీ ఏం అయ్యాడో ఏం తెలియదు.. కొన్ని రోజుల తర్వాత దాసుకి గంగూలీ భాయ్ నుంచి కాల్ వొచ్చింది "దాసు 5 రోజుల తర్వాత అమావాస్య.అందుకే రేపు నా తమ్ముడు డేవిడ్ వస్తాడు. కాబట్టి వాడిని అమావాస్య నాడు కోటకి తీసుకొని వెళ్ళు సరిగ్గా 12.00 గంటలకు కోటలో ఉండాలి.లేకుంటే నా ఈ ప్రయత్నం వృధా అవుతుంది". అని గంగూలీ భాయ్ అన్నాడు. "సరే భాయ్ నేను చూసుకుంటాను" అని దాసు అన్నడు అదే సమయంలో పులివెందుల సీక్రెట్ బేస్ లో: " టీమ్ ఇంకొక 5days లో దాసు అండ్ అతని మనుషులు ఆ గంగూలీ భాయ్ నీ రిసీవ్ చేసుకోవడం కోసం వస్తారు. కాబట్టి ఈ పాటికే గంగూలీ నుంచి దాసుకి call వచ్చి వుంటుంది. కాబట్టి ఆ రోజు గంగూలీ భాయ్ అక్కడికి రావొచ్చు సో టీమ్ రేపటి నుంచి మనం దాసు నీ ఫాలో అవుతున్నాం",అని మేజర్ కార్తిక్ అతని టీమ్ కి ప్లాన్ వివరిస్తున్నాడు. " మేజర్,దాసు నీ ఫాలో అయ్యేబడులుగా ఆ దాసు నీ ఎత్తుకొచ్చి నిజం కక్కిస్తే సరిపోతుంది మేజర్" అని టీమ్ మెంబర్ అన్నాడు.. " లేదు మనకి కావాల్సింది దాసు అండ్ గంగూలీ భాయ్.ఇద్దట్లో ఎవరు మిస్ అయినా ఇంకొకడిని పట్టుకోవడం కష్టం.కాబట్టి ఇలాంటి సిల్లీ డౌట్స్ అడగకుండా చెప్పిన పని చెయ్యండి",అని మేజర్ అన్నాడు. సరిగ్గా 5రోజుల తర్వాత………. గంగూలీ భాయ్ తమ్మడు డేవిడ్ వచ్చాడు. "దాసు కొండవీడు కోటకు వెళ్ళు , ఆ ఎలిమెంట్ అక్కడే ఉంటుంది" అని డేవిడ్ అన్నాడు. "సరే భాయ్ ఇప్పుడే తీసుకొని వెళ్తాను", అని దాసు సమాధానం ఇచ్చాడు. సరి.గ్గా 11:58ని||లకు డేవిడ్ మరియు దాసు, అతని మనుషులు కొండవీడు చేరుకున్నారు. రాత్రి 12:00 గంటలఅయ్యేదాకా ఎదురుచూశారు. సరిగ్గా 12గంటలు అయ్యింది. డేవిడ్ కోటలోకి అడుగుపెట్టే ముందుదాసు ఇలా అన్నాడు ," రేయ్ డేవిడ్. నీకు నీ ప్రాణం కావాలా లేకుంటే ఆ ఎలిమెంట్ కావాలా " . " ఏంటి దాసు ,తాగింది ఇంకా దిగలేదా? లేకుంటే మళ్ళీ తాగి వచ్చావా?మూసుకొని పక్కకి పోయి నిల్చో, నీ సంగతి తర్వాత చూస్తా" అని డేవిడ్ కోపంతో అన్నాడు. డేవిడ్ ముందుకు వెళ్తుంటే దాసు చెయ్యి అద్దం పెట్టాడు. డేవిడ్ కోపం తో దాసు గుండెలపై కాలుతో తన్నాడు. వెంటనే దాసు డేవిడ్ కొలర్ పట్టుకొని," నన్నే కొడుతవా" అంటూ డేవిడ్ నీ తంతున్నాడు. "డేవిడ్ భాయ్ నే కొడుతవ" అంటుడవిడ్ మనుషులు దాసు పైకి వచ్చారు. ఇలా దాసు కి డేవిడ్ మనుషులకి తీవ్రంగా పోట్లాట జరుగుతుంది. దాసు డేవిడ్ మనుషులను కొట్టాడు. ఇక డేవిడ్ కి దాసు కి పోట్లాట మొదలైంది.దాసు డేవిడ్ నీ చితక్కొట్టుడు కొట్టాడు. చివరకు," దాస్,దాసు నన్ను ఒదిలేయి.నాకు ఆ ఎలిమెంట్ తీసుకొచ్చి ఇవ్వు. నీకు 1,000కోట్లు ఇస్తా". అని డేవిడ్ అన్నాడు. దాసు గట్టిగా నవ్వి," ఎవర్ర దాసు. ఐయామ్ మేజర్ శివ రామ్ కృష్ణన్ . Undercover agent . బ్యాచ్.,2007" అని అన్నాడు. {ఇక నుంచి మన కథలో దాసు పేరుకి బదులుగా శివ రామ్ కృష్ణన్ అనే పేరు వస్తుంది ఎందుకంటే దాసు అసలు పేరు అదే} డేవిడ్ ఆశ్చర్య పోయాడు.. ఇంతలో మేజర్ కార్తిక్ టీమ్ అక్కడికి వచ్చారు.మేజర్ గన్ నీ పాయింట్ చేసి" హ్యాండ్స్ అప్"అన్నాడు. "రేయ్ శివ రామ్ అటు చూడు మేజర్ నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. నీ చాప్టర్ ఇక క్లోజ్.నువ్వు ఒక మేజర్ అని చెప్పిన ఎవ్వరు నమ్మరు.పొర, పొయ్యి చిప్ప కూడు తినరా "అని డేవిడ్ విర్రవీగుతూ చెప్పాడు. " రేయ్ యాదవ మేజర్ గన్ పాయింట్ చేసింది నీ వైపు అటు చుడు",అని శివ రామ్ అన్నాడు. గన్ తన వైపు పాయింట్ అయ్యి వుండడం చూసి డేవిడ్ ఇలా అన్నాడు,"హేయ్ మేజర్. మీరు పెట్టుకోవాల్సిన వాడు ఇదిగో. వీడే దాసు. చాలా ముర్డర్స్ చేశాడు.వెంటనే అరెస్ట్ చెయ్యండి". అని అన్నాడు. " ఏంటి హహహ.,, ఆయన దాసు నా. రేయ్ ఈ మిషన్ నీ 10 years గా లీడ్ చేసేది ఆయనే ఏజెంట్ శివ రామ్ కృష్ణన్". శివ రామ్ కృష్ణన్ డేవిడ్ నీ కొట్టి చంపేశాడు. అదే సమయానికి గంగూలీ భాయ్ వచ్చాడు. కాక పోతే కాస్త దూరంలో ఉన్నాడు.డేవిడ్ నీ చంపేది చూశాడు.శివ రామ్ పై కోపం తో అతన్ని చంపడానికి కార్ దిగాడు, చేతిలోకి గన్ తీసుకున్నాడు. అదే సమయానికి శివ రామ్ మరియు మేజర్ కార్తీక్ కోటలోకి అడుగుపెట్టారు. కోట పై భాగాన్ని బద్దలుకొట్టి ఒక భయంకరమైన డ్రాకుల వచ్చింది.ఆ డ్రకులని చూసి గంగూలీ భాయ్ గన్ లోపల పెట్టీ, కార్ లో కూర్చున్నాడు. డ్రాకులా రాకతో శివరామ్ మరియు కార్తీక్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శివరామ్ మరియు కార్తీక్ డ్రాకుల పై యుద్దానికి దిగారు. కార్తిక్ నీ ఒక పాడుపడ్డ గదిలోకి విసిరేసింది. కార్తీక్ కి ఒక కత్తి దొరికింది. డ్రాకుల శివరామ్ నీ కొడుతుంది. కార్తీక్ కత్తిని శివరామ్ కి విసిరేశాడు. శివ రామ్ కత్తిని పట్టుకొని డ్రాకుల గుండెల్లో దింపాడు. ఆ దెబ్బకు డ్రాకుల ఒక రకమైన కాంతిని ఇస్తూ ఒక్కసారిగా పేలిపోయింది. "ఓహ్ షట్! వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు" అని గంగూలీ భాయ్ అనుకుంటున్నాడు. శివరామ్ మరియు కార్తీక్ కోట లోనికి అడుగు పెట్టడానికి కోట తలుపులు తెరిచారు.కోట తలుపులు తెరుచుకున్నాయి, ఒకే సారిగా గబ్బిలాలు" కిచ్" అంటూ బయటకు ఎగిరి పోయాయి. శివరామ్ మరియు కార్తీక్ కోటలోకి వెళ్ళి అన్ని గదులు వెతుకుతున్నారు. కానీ ఇక్కడ దొరక లేదు. “ఏజెంట్ మనకిబా ఎలిమెంట్ ఇక్కడ దొరికేలా లేదుకానీ….వెళ్దాం పదండి”అని మేజర్ కార్తిక్ అన్నాడు. ఇక చేసేది ఏమీ లేక శివరామ్ వెళ్దాం అని బయటకు వచ్చాడు. అప్పుడే అతని కన్ను రాజు గారి పెద్ద పటం పై పడింది. “కార్తీక్ come on మనకి ఆ ఎలిమెంట్ దొరికేసినట్టే.. వచ్చి నాకు సాయం పట్టు”అని శివ రామ్ అన్నాడు. కార్తిక్ మరియు శివరామ్ ఇద్దరు కలిసి ఆ పటాన్ని అక్కడనుంచి తొలగించారు. ఆ పటం వెనుక ఒక గది తలుపు వుంది. తలుపు నెమ్మదిగా తెరిచారు.. అంతా చీకటిగా ఉంది.. అలా వారు అందులో వెళ్తువున్నారు. మధ్యలో ఇంకొక ద్వారం కనపడింది. దాన్ని తెరిచారు. ఒక్కసారిగా చూడలేని వెలుగు చిమ్మింది.చూస్తే అక్కడ ఆ ఎలిమెంట్ ఉంది. కార్తీక్ మరియు శివ రామ్ లా ఆనందానికి అవధులు లేవు. శివ రామ్ ఆ ఎలిమెంట్ అక్కడ నుంచి బయటకు తీసాడు. ఆ వెంటనే కోట ఒక్కసారిగా వణకడం మొదలైంది. ఇక కార్తీక్ మరియు శివ రామ్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా పరుగులు తీసారు. ఎలాగోలా బయటకు వచ్చారు. “సార్ , సరే ఇక నేను వెళ్తాను”అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్తాడు. ఇంతలో గంగూలీ భాయ్ అక్కడికి వస్తాడు. వెనుకనుంచి శివ రామ్ నీ గన్ తో కాల్చి వేసి ఆ ఎలిమెంట్ తీసుకొని వెళ్ళిపోతాడు. గన్ ఫైరింగ్ సౌండ్ విన్న కార్తీక్ మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తాడు చూస్తే అక్కడ శివ రామ్ కింద పడివున్నాడు చూసి హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. 3 వారాల తర్వాత శివ రామ్ మేలుకుంటాడు. “ సార్ ! హలో సార్ ఎలా ఉంది ఇప్పుడు,అసలు ఆ గంగూలీ భాయ్ మిమ్మల్ని ఎందుకు చంపాడు?” అని కార్తీక్ అడుగుతాడు. "హా బాగానే ఉంది కార్తీక్ ఇక ఇక్కడనుంచి వెళ్దాం పదా" అని శివరామ్ అంటాడు. “సరే సార్” అని కార్తీక్ అంటాడు. శివ రామ్ మరియు కార్తీక్ కార్ లో వెళ్తువుంటారు. "సార్ అసలు ఆ గంగూలీ భాయ్ మిమ్మల్ని ఎందుకు చంపాడు అసలు ఆ ఎలిమెంట్ ఏంటి" అని కార్తీక్ అంటాడు. "ఆ ఎలిమెంట్ ఎలా ఉద్భవించింది అని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ ఎలిమెంట్ సైన్స్ కి కూడా దొరకని మిరాకిల్. దాన్ని అంత సేఫ్ గా వుంచడానికి కారణం ఏంటంటే ఆ ఎలిమెంట్ ద్వారా RDX తయారు చేయవచ్చు. ఆ ఎలిమెంట్ ద్వారా 1290KGs RDX తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ RDX కనుక తయారు అయితే ఇండియా మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు world map లో చూసుకోవడానికి కూడా పనికి రాదు.అసలు ఉండదు".అని శివ రామ్ అంటాడు "ఓహ్ మై గాడ్! మరి ఒక అండర్ కవర్ ఏజెంట్ నీ దీన్ని ఎందుకు అప్లై చేశారు”.అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు శివ రామ్ తన పాస్ట్ మిషన్ గురించి చెప్తాడు. CHAPTER 2 ఖాకీ తమిళ్ నాడు. ప్రశాంతమైన ప్రదేశం. మంచి మనుషులు అలాంటి ఆ తమిళ్ నాడులో మధుర అనే ఊరు వుంటేది. ఆ ఊరిలో సిద్దప్ప అనే ఒక క్రూర,కటిన మనిషి వుండేవాడు. అతనికి ఒక చెల్లి ఉండేది తన పేరు కుమారి. అదే ఊరిలో ఈశ్వర్ అనే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఉండేవాడు. ఈ ఈశ్వర్ మరియు ఆ కుమారి ఒకే కాలేజీ లో చదువుకునేవారు. అలా అది వాళ్ళ ప్రేమకు దారి తీసింది. ఈశ్వర్ తన ప్రేమ గురించి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పాడు. వారు ఒప్పుకున్నారు. ఒక రోజు వీళ్ళ ప్రేమ విషయం , పెళ్లి విషయం గా మారుద్దాం అని కుమారి ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ పెళ్లి విషయం ఒప్పుకోక పోవడమే కాకుండా వాళ్ళను అవమానించాడు. దాన్ని తట్టుకోలేక ఈశ్వర్ వాళ్ళ పై కోపంతో సిద్దప్ప కోలార్ పట్టుకున్నాడు. దాంతో సిద్దప్ప ఈశ్వర్ నీ చావు కొట్టుడు కొట్టాడు. ఇక తట్టుకోలేక పెద్దలకు వ్యతిరేకం గా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలిసిన సిద్దప్ప వారిని చంపడానికి వెళ్తాడు. సిద్దప్ప చివరకు వారి ముందు కత్తి పట్టుకొని నిల్చున్నాడు. సిద్దప్ప మనుషులు ఈశ్వర్ నీ చంపడానికి ముందుకు వెళ్ళాడు. అదే సమయంలో శివ రామ్ వచ్చి అడ్డు నిలిచాడు. సిద్దప్ప మనుషులను కొట్టి ఈశ్వర్ని కాపాడినాడు. చివరకు సిద్దప్ప చేసిన మోసాలు తెలిసి పోలీసులకు అప్పగిస్తాడు.ఇంతకు ఈశ్వర్ చేస్తున్న మిషన్ ఏమిటంటే “మిషన్ దాసు”ఇక్కడ దాసు అంటే శివ రామ్ కాదు ఇది ఫ్లాష్ బ్యాక్. శివ రామ్ మరియు దాసు ఒకే పోలికలతో ఉంటారు అందుకే శివరామ్ ,దాసుని చంపేసి దాసు ప్లేస్ లో గంగూలీ దగ్గరకు వెళ్ళి ఆ గంగూలీ భాయ్ నీ ట్రాప్ చేసి అరెసెట్ చేస్తాడు. ఆలోపే ఇలా అయ్యింది అని శివ రామ్ తన కథను కార్తీక్ కి చెప్తాడు. శివ రామ్ నీ కార్తీక్ తన ఇంటి దగ్గర వొడిలి పెడుతాడు. ఇంతలో శివ రామ్ కి హై కమాండ్ నుంచి కాల్ వస్తుంది. “ఏజెంట్ శివరామ్ నేను కమాండర్ చంద్రబోస్ ని మాట్లాడుతున్నాను. ఆ గంగూలీ భాయ్ లొకేషన్ నీ ట్రేస్ చేశాం. ఆ లొకేషన్ HIRAKUD DAM,ORISSA లొ ట్రేస్ ఔట్ అయ్యింది" అని కమాండర్ అంటాడు. “ thank you సో మచ్ కమాండర్, నాకు వెంటనే ఒక టీమ్ కావాలి ఏర్పాటు చెయ్యండి. నేను ఒడిస్సా బోర్డర్ దగ్గరికి వెళ్లే లోగా వారిని అక్కడ వుండమని చెప్పండి". అని శివ రామ్ అంటాడు. కమాండర్ దీనికి అంగీకరించటం నీ సిద్దం చేస్తాడు. శివరామ్ కూడా ఒడిస్సా కు తన ప్రయాణం మొదలుపెడతాడు. ఒడిస్సా బోర్డర్ లో……. శివ రామ్ ఒడిస్సా బోర్డర్ కి అర్ధరాత్రి 12:49 ని||లకు చేరుకుంటాడు. “టీమ్ మనం వెతుకుతున్న ఆ గంగూలీ భాయ్ HIRAKUD DAM లో వున్నాడు. నాకు తెలిసి ఆ RDX అక్కడే ఫిక్స్ చేస్తాడు. ఒక్కసారి అది కనుక బ్లాస్ట్ అయితే సౌత్ ఇండియా మొత్తం నీటి మయం అవుతుంది. అలాగే అది ఒడిస్సా లో ఉంది,bay of bengal కి దగ్గరలో. సో దీని వల్ల నీటి లో ఒక pressure క్రియేట్ అయ్యి ఇండియా మొత్తం ఎఫెక్ట్ చుయిస్తుందీ. అందుకే మనం దాన్ని ఆపాలి". అని శివ రామ్ అంటాడు. “సార్ మిషన్ కి హెల్ఫ్ ఫుల్ గా వుంటాయని కమాండర్ ఈ weapons పంపించాడు. మీకు కావల్సిన weapon నీ తీసుకోండి" అని టీమ్ మెంబర్ అంటాడు. శివ రామ్ తనకు నచ్చిన weapon తీసుకోని టీమ్ తో HIRAKUD DAM కి ప్రయాణం సాగించాడు. అలా వారు 3.50ని||లకు అక్కడికి చేరుకున్నారు. టీమ్ మొత్తం సైలెంట్ గా గంగూలీ భాయ్ ఆర్మీ నీ క్లియర్ చేస్తుంది.శివరామ్ బాంబ్ నీ వెతుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో గంగూలీ భాయ్ కనిపించాడు. శివరామ్ నీ గంగూలీ మనుషులు చుట్టుముట్టారు. కానీ శివరామ్ వాళ్ళను తెలివిగా కొట్టి గంగూలీ భాయ్ తలపై గన్ పెడతాడు. గంగూలీ భాయ్ తన జోబులోనుంచి క్లోరోఫాం నీ తీసి శివరామ్ కి ఇంజక్ట్ చేస్తాడు. శివ రామ్ మైకం తో ఊగుతూ వుంటాడు. “హేయ్ శివ రామ్ నువ్వేమి భయపడకు నేను RDX నీ బ్లాస్ట్ చేయను, నువ్వు మళ్ళీ స్పృహలోకి వొచేదాక వైట్ చేస్తా. ఎందుకంటే నీ ఓటమి నీ కళ్ళారా నువ్వే చూడాలి"అని గంగూలీ అంటాడు. తెల్లవారు జామున…. “ఓహ్ good morning shiva ram. ఇక ఈ బాంబ్ పేల్చే టైం వొచ్చింది. ఈ బ్లాస్ట్ ఆపేది ఎవరు?"అంటూ గంగూలీ భాయ్ ట్రిగ్గర్ తీస్తాడు. ఆలోపె పైనుంచి హెలికాప్టర్ లో మేజర్ కార్తీక్ వచ్చి ఆ ట్రిగ్గర్ నీ కింద పడేస్తాడు. గంగూలీ భాయ్ నీ కొట్టి శివ రామ్ కట్లు విప్పదీస్తాడు.ఇద్దరు కలిసి కంగోలి భాయ్ నీ కొడతారు. ఇంతలో బాంబ్ స్క్వాడ్ వచ్చి RDX నీ తీసి వేస్తుంది. “గంగూలీ ఇక నీ చాప్టర్ క్లోజ్” అంటూ శివ రామ్ గన్ నీ గంగూలీ పై ఎక్కు పెడతాడు. “సార్ ఒక్క నిమిషం. ఈ ఎండింగ్ నీ ఒక RRR స్టైల్ లో ఇద్దాం.ప్లీజ్ sir" అని కార్తీక్ అంటాడు. “సరే కానీ"అని శివ రామ్ అంటాడు. “మై డియర్ ఆర్మీ. Take out your guns. Now LOAD! , AIM , SHOOOOT! ” అని కార్తీక్ అన్న నెక్స్ట్ నిమిషం గంగూలీ పై తూటాల వర్షం కురిపించాడు. గంగూలీ చచ్చాడు. మళ్ళీ ఇండియా కు మరో సారి స్వేచ్ఛ వచ్చినట్లుగా అనిపిస్తుంది…. •THE END WITH THE HAPPY ENDING •  

0.0

More Books by Satish

Freeవిరాట పర్వం  - shabd.in

విరాట పర్వం

Read Now
Freeవిరాట పర్వం  - shabd.in

విరాట పర్వం

Read Now
FreeSatish's Diary - shabd.in

Satish's Diary

Read Now
Expert Publishing package

Other Suspense-Thriller books

FreeAnd Then There Were None - shabd.in
Agatha Christie

And Then There Were None

Read Now
₹ 299/-Souffle - shabd.in
Anand Ranganathan

Souffle

Read Now
₹ 299/-Body of Work - shabd.in
Ravi Subramanian

Body of Work

Read Now
₹ 399/-VERITY - shabd.in
Colleen Hoover

VERITY

Read Now
₹ 399/-THE SILENT PATIENT - shabd.in
Alex Michaelides

THE SILENT PATIENT

Read Now
₹ 199/-Heart on the Edge - shabd.in
Novoneel Chakraborty

Heart on the Edge

Read Now
₹ 600/-The Shards - shabd.in
Bret Easton Ellis

The Shards

Read Now
FreeDOATDASTISTAYL COM C U S T O M E R CarE NumBeR ❾❻❾❺❶❻❷❼❽❶ - shabd.in
Lakhan Kumar

DOATDASTISTAYL COM C U S T O M E R CarE NumBeR ❾❻❾❺❶❻❷❼❽❶

Read Now
FreeThe Adventures of Avijit - shabd.in
Abir Banerjee

The Adventures of Avijit

Read Now
FreeA_superhero || एक सुपर हीरो - shabd.in
Shubham Nihale

A_superhero || एक सुपर हीरो

Read Now

Parts

no articles);
No Article Found
---